ద్రాక్షావల్లిని నేను - Dhraakshaavallini Nenu | Telugu Christian Songs | Jesus Songs

             ద్రాక్షావల్లిని నేను

ద్రాక్షావల్లిని నేను - Dhraakshaavallini Nenu | Telugu Christian Songs | Jesus Songs.


ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు.

ద్రాక్షావల్లిని నేను ద్రాక్షాతీగెలు మీరు అక్షయు డేసిటు బలికె
అతిముదమునను వినరండి ||ద్రాక్షా||

1. నాయందుండని తీగె నాశనమొందును నిజము నాశనమొందక మీరు
నాయందుండుడి ఫలియింపన్ ||ద్రాక్షా||


2. ఫలముల నివ్వని తీగె పనికిరాదని నరికి పారవేయంబడును నిరతము
తధ్యము నిప్పులలో ||ద్రాక్షా||


3. ఫలించు ప్రతి తీగె ఫలముల పెక్కుగ నివ్వన్ పరిశుద్ధి చేయబడున్
యెఱుగరే మీరది అనవరతం ||ద్రాక్షా||


4. నాయందుండినగాని నయమగు కాపుండదిలన్ నాయందుండిన వాడు
నాణ్యపు ఫలములనిచ్చు నాహా ||ద్రాక్షా||


5. మీరు యేదియు చేయ లేరు నాకు వేరై వేరుగ మీరుండినచో
వెంటనే యెండిపోయెదరు ||ద్రాక్షా||


6. కాన యేసుని యందు మానకనుందుము స్వేచ్ఛన్ మాన్యుడేసుని
పలుకుల్ మదిదలచెద మిల మరువకను ||ద్రాక్షా||

  

About Our channel:

Bekind - Telugu Christian Songs...

ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు - Aandhra Kraisthava Keerthanalu Telugu Songs with Lyrics...

Exclusive Telugu Christian Songs - Andhra Christava Keerthanalu - Updating 100's of Songs...
For more updates
Please do subscribe our channel:https://bit.ly/2zgchLZ


Comments