నడిపించు నా నావ - Nadipinchu Na Nava Song | Andhra Kraistava Keerthanalu | Telugu Christian Songs

ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు: నడిపించు నా నావ - Nadipinchu Na Nava Song - Male Version. #NadipinchuNaNava #AndhraKraistavaKeerthanalu #TeluguChristianSongs



Lyrics: నడిపించు నా నావా నడి సంద్రమున దేవా నవ జీవన మార్గమున నా జన్మ తరియింప ||నడిపించు|| నా జీవిత తీరమున నా అపజయ భారమున నలిగిన నా హృదయమును నడిపించుము లోతునకు నా యాత్మ విరబూయ నా దీక్ష ఫలియింప నా నావలో కాలిడుము నా సేవ చేకొనుము ||నడిపించు|| రాత్రంతయు శ్రమపడినా రాలేదు ప్రభు జయము రహదారులు వెదకిననూ రాదాయెను ప్రతిఫలము రక్షించు నీ సిలువ రమణీయ లోతులలో రతణాలను వెదకుటలో రాజిల్లు నా పడవ ||నడిపించు|| ఆత్మార్పణ చేయకయే ఆశించితి నీ చెలిమి అహమును ప్రేమించుచునే అరసితి ప్రభు నీ కలిమి ఆశ నిరాశాయే ఆవేదనెదురాయే ఆధ్యాత్మిక లేమిగని అల్లాడే నావలలు ||నడిపించు|| లోతైన జలములలో లోతున వినబడు స్వరమా లోబడుటను నేర్పించి లోపంబులు సవరించి లోనున్న ఈవులలో లోతైన నా బ్రతుకు లోపించని అర్పనగా లోకేష చేయుమయా ||నడిపించు|| ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు ప్రేమలో పాదుకొని ప్రకటింతును లోకములో పరిశుద్ధుని ప్రేమ కథ పరమాత్మ ప్రోక్షణతో పరిపూర్ణ సమర్పణతో ప్రాణంబును ప్రభు కొరకు పానార్పణము చేతు


for more updates please do subscribe our channel: https://bit.ly/2zgchLZ Follow us on our Social Sites: Twitter: https://twitter.com/christiansongsz Blogger: https://bekindteluguchristiansongs.blogspot.com/ Instagram: https://www.instagram.com/bekindteluguchristiansongs/

Comments