నీ ధనము నీ ఘనము | Andhra Kraisthava Keerthanalu Jesus Songs

ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే - Nee Dhanamu Nee Ghanamu Song with Lyrics - Male Version. Andhra Kraisthava Keerthanalu Song

Lyrics: నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగమునీయ వెనుదీతువా – వెనుదీతువా ||నీ ధనము|| ధరలోన ధన ధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా (2) పరలోక నాధుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా ||నీ ధనము|| పాడిపంటలు ప్రభువు నీకీయగా కూడు గుడ్డలు నీకు దయచేయగా (2) వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయ నో క్రైస్తవా ||నీ ధనము|| వెలుగు నీడలు గాలి వర్షంబులు కలిగించె ప్రభు నీకు ఉచితంబుగా (2) వెలిగించ ధర పైని ప్రభు నామము కలిమి కొలది ప్రభున కర్పింపవా ||నీ ధనము|| కలిగించె సకలంబు సమృద్దిగా తొలగించె పలుభాధ భరితంబులు (2) బలియాయె నీ పాపముల కేసువే చెలువంగ ప్రభుకీయ చింతింతువా ||నీ ధనము|| Bekind - Telugu Christian Songs... Andhra Kraisthava Keerthanalu Songs Exclusive Telugu Christian Songs - Andhra Christava Keerthanalu - Updating 100's of Songs... for more updates please do subscribe our channel: https://bit.ly/2zgchLZ



Comments