మార్గము చూపుము ఇంటికి - Maargamu Choopumu Intiki Song with Lyrics | Andhra Kraisthava Keerthanalu

ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు: మార్గము చూపుము ఇంటికి - Maargamu Choopumu Intiki Song with Lyrics - Female Version | Andhra Kraisthava Keerthanalu.

Lyrics: మార్గము చూపుము ఇంటికి – నా తండ్రి ఇంటికి మాధుర్య ప్రేమా ప్రపంచమో – చూపించు కంటికి (2) పాప మమతల చేత – పారిపోయిన నాకు ప్రాప్తించె క్షామము పశ్చాత్తాప్పమునొంది – తండ్రి క్షమ కోరుచు పంపుము క్షేమము (2) ప్రభు నీదు సిలువ – ముఖము చెల్లని నాకు పుట్టించె ధైర్యము (2) ||మార్గము|| ధనమే సర్వంబనుచు- సుఖమే స్వర్గంబనుచు తండ్రిని వీడితి ధరణి భోగములెల్ల – బ్రతుకు ధ్వంసము జేయ దేహీ నిను చేరితి (2) దేహీ అని నీ వైపు – చేతులెత్తిన నాకు దారిని జూపుము (2) ||మార్గము|| దూర దేశములోన – బాగుందుననుకొనుచు తప్పితి మార్గము తరలిపోయిరి నేను – నమ్మిన హితులెల్ల తరిమే దారిద్య్రము (2) దాక్షిణ్య మూర్తి నీ – దయ నాపై కురిపించి ధన్యుని చేయుము (2) ||మార్గము|| అమ్ముకొంటిని నేను – అధముడొకనికి నాడు ఆకలి బాధలో అన్యాయమయిపోయే – పందులు సహ వెలివేయ అలవడెను వేదన (2) అడుగంటె అవినీతి – మేల్కొనియె మానవత ఆశ్రయము గూర్చుము (2) ||మార్గము|| కొడుకునే కాదనుచు – గృహమే చెరసాలనుచు కోపించి వెళ్ళితి కూలివానిగనైన – నీ యింట పని చేసి కనికరమే కోరుదు (2) కాదనకు నా తండ్రి – దిక్కెవ్వరును లేరు క్షమియించి బ్రోవుము (2) ||మార్గము|| నా తండ్రి నను జూచి – పరుగిడిచూ ఏతెంచి నాపైబడి ఏడ్చెను నవ జీవమును గూర్చి – ఇంటికి తోడ్కొని వెళ్లి నన్నూ దీవించెను (2) నా జీవిత కథయంత – యేసు ప్రేమకు ధరలో సాక్ష్యమై యుండును (2) ||మార్గము||

for more updates please do subscribe our channel: https://bit.ly/2zgchLZ Follow us on our Social Sites: Twitter: https://twitter.com/christiansongsz Blogger: https://bekindteluguchristiansongs.blogspot.com/ Instagram: https://www.instagram.com/bekindteluguchristiansongs/


Comments