హే ప్రభుయేసు - Hey Prabhu Yesu Song with Lyrics Telugu | Andhra KraisthavaKeerthanalu | Jesus Songs

Andhra KraisthavaKeerthanalu:

హే ప్రభుయేసు - Hey Prabhu Yesu Song with Lyrics Telugu | Andhra KraisthavaKeerthanalu | Jesus Songs



Lyrics:
హే ప్రభుయేసు హే ప్రభుయేసు హే ప్రభు దేవసుతా
సిల్వధరా – పాపహరా – శాంతికరా       ||హే ప్రభు||
శాంతి సమాధానాధిపతీ
స్వాంతములో ప్రశాంతనిధీ (2)
శాంతి స్వరూపా జీవనదీపా (2)
శాంతి సువార్తనిధీ         ||సిల్వధరా||
తపములు తరచిన నిన్నెగదా
జపములు గొలిచిన నిన్నెగదా (2)
విఫలులు చేసిన విజ్ఞాపనలకు (2)
సఫలత నీవెగదా        ||సిల్వధరా||
మతములు వెదకిన నిన్నెకదా
వ్రతములుగోరిన నిన్నెగదా (2)
పతితులు దేవుని సుతులని నేర్పిన (2)
హితమతి వీవెగదా       ||సిల్వధరా||
పలుకులలో నీ శాంతికధ
తొలకరి వానగా కురిసెగదా (2)
మలమల మాడిన మానవ హృదయము (2)
కలకలలాడె కదా       ||సిల్వధరా||
కాననతుల్య సమాజములో
హీనత జెందెను మానవత (2)
మానవ మైత్రిని సిల్వ పతాకము (2)
దానము జేసెగదా        ||సిల్వ ధరా||
దేవుని బాసిన లోకములో
చావుయే కాపురముండె గదా (2)
దేవునితో సఖ్యంబును జగతికి (2)
యీవి నిడితివి గదా        ||సిల్వ ధరా||
పాపము చేసిన స్త్రీని గని
పాపుల కోపము మండె గదా (2)
దాపున జేరి పాపిని బ్రోచిన (2)
కాపరి వీవెగదా        ||సిల్వ ధరా||
ఖాళీ సమాధిలో మరణమును
ఖైదిగ జేసిన నీవే గదా (2)
ఖలమయుడగు సాతానుని గర్వము (2)
ఖండనమాయె గదా        ||సిల్వ ధరా||
కలువరిలో నీ శాంతి సుధా
సెలయేరుగ బ్రవహించె గదా (2)
కలుష ఎడారిలో కలువలు పూయుట (2)
సిలువ విజయము గదా           ||సిల్వ ధరా||


Follow us on our Social Sites: 

Comments