ఆయనే నా సంగీతము - Aayane Naa Sangeethamu Lyrical Song Jesus Telugu | And...




ఆయనే నా సంగీతము - Aayane Naa Sangeethamu Lyrical Song Jesus Telugu | Andhra Kraisthava Keerthanalu. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు. ఆయనే నా సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల స్తుతించెదము ||ఆయనే|| స్తుతుల మధ్యలో నివాసం చేసి దూతలెల్ల పొగడే దేవుడాయనే (2) వేడుచుండు భక్తుల స్వరము విని దిక్కు లేని పిల్లలకు దేవుడాయనే (2) ||ఆయనే|| ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోన (2) ఉండెదననిన మన దేవుని కరములు తట్టి నిత్యం స్తుతించెదము (2) ||ఆయనే|| సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవిత కాలమెల్ల కీర్తించెదము (2) రాకడలో ప్రభుతో నిత్యముందుము మ్రొక్కెదము స్తుతించెదం పొగడెదము (2) ||ఆయనే|| Bekind - Telugu Christian Songs... Andhra Kraisthava Keerthanalu Songs Exclusive Telugu Christian Songs - Andhra Christava Keerthanalu - Updating 100's of Songs...

Comments