ఎన్ని తలచినా ఏది అడిగినా - Enni Thalachinaa Edi Adiginaa | Karaoke Track with Lyrics | Jesus Songs

          ఎన్ని తలచినా ఏది అడిగినా 

ఎన్ని తలచినా ఏది అడిగినా - Enni Thalachinaa Edi Adiginaa | Karaoke Track with Lyrics | Jesus Songs.


ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు.

ఎన్ని తలచినా ఏది అడిగినా
జరిగేది నీ చిత్తమే (2) ప్రభువా
నీ వాక్కుకై వేచియుంటిని
నా ప్రార్థన ఆలకించుమా (2) ప్రభువా

నీ తోడు లేక నీ ప్రేమ లేక
ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు (2)
అడవి పూవులే నీ ప్రేమ పొందగా (2)
నా ప్రార్థన ఆలకించుమా (2) ప్రభువా      ||ఎన్ని||

నా ఇంటి దీపం నీవే అని తెలసి
నా హృదయం నీ కొరకై పదిలపరచితి (2)
ఆరిపోయిన నా వెలుగు దీపము (2)
వెలిగించుము నీ ప్రేమతో (2) ప్రభువా      ||ఎన్ని||

ఆపదలు నన్ను వెన్నంటియున్నా
నా కాపరి నీవై నన్నాదుకొంటివి (2)
లోకమంతయూ నన్ను విడచినా (2)
నీ నుండి వేరు చెయ్యవు (2) ప్రభువా      ||ఎన్ని||

నా స్థితి గమనించి నన్నూ ప్రేమించి
నా కొరకై కల్వరిలో యాగమైతివి (2)
నీదు యాగమే నా మోక్ష మార్గము (2)
నీయందే నిత్యజీవము (2) ప్రభువా         ||ఎన్ని||


  

About Our channel:

Bekind - Telugu Christian Songs...

ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు - Aandhra Kraisthava Keerthanalu Telugu Songs with Lyrics...

Exclusive Telugu Christian Songs - Andhra Christava Keerthanalu - Updating 100's of Songs...
For more updates
Please do subscribe our channel:https://bit.ly/2zgchLZ





Comments