మధుర మధుర మధురసేవ - Madhura Madhura Madhura Seva | Telugu Christian Songs | Jesus Songs

            మధుర మధుర మధురసేవ

మధుర మధుర మధురసేవ - Madhura Madhura Madhura Seva | Telugu Christian Songs | Jesus Songs.

ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు.
మధుర మధుర మధురసేవ – యేసు ప్రభు సేవ
 
దేవదూతకును లేని దైవజనుని సేవ 
దేవసుతిని సంఘ సేవ దివ్యమౌ సువార్త సేవ 
  
పరిశుద్ధాత్మ ప్రోక్షణముచే ప్రజ్వరిల్లుసేవ 
పరిమళించువాక్య సేవ ప్రతిఫలించు సాక్ష్య సేవ 
  
ప్రభుని పేర ప్రజల యెదుట ప్రవచనాల సేవ 
ప్రజల పేర ప్రభుని యెదుట ప్రార్ధనలువచించు సేవ 
  
భాగ్యభోగనిధులు లేని - భారభరితసేవ 
బాష్పసిరులలోన మెలగి బాధలను వరించు సేవ 
  
సిలువమూర్తి కృపలు జాట సిగ్గుపడని సేవ 
సిలువనిందలను భరింప శిరమువంచి మురియు సేవ 
  
లోకజ్ఞాని అపహసించు శోకమూర్తి సేవ
లోకులను దీవించు సేవ లోకమును జయించు సేవ 
  
దైవజనుడ మరువకోయి దైవపిలుపునోయి
దైవనీతివదలకోయి దేవుడు దీవించునోయి 

   

About Our channel:

Bekind - Telugu Christian Songs...

ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు - Aandhra Kraisthava Keerthanalu Telugu Songs with Lyrics...

Exclusive Telugu Christian Songs - Andhra Christava Keerthanalu - Updating 100's of Songs...
For more updates
Please do subscribe our channel:https://bit.ly/2zgchLZ




Comments