పరవాసిని నే జగమున ప్రభువా - Paravaasini Ne Jagamuna Prabhuvaa | Telugu Christian Songs | Jesus Songs
పరవాసిని నే జగమున ప్రభువా
పరవాసిని నే జగమున ప్రభువా - Paravaasini Ne Jagamuna Prabhuvaa | Telugu Christian Songs | Jesus Songs.
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు.
పరవాసిని నే జగమున ప్రభువా (2)
నడచుచున్నాను నీ దారిన్
నా గురి నీవే నా ప్రభువా (2)
నీ దరినే జేరెదను
నేను.. నీ దరినే జేరెదను ||పరవాసిని||
లోకమంతా నాదని యెంచి
బంధు మిత్రులే ప్రియులనుకొంటిని (2)
అంతయు మోసమేగా (2)
వ్యర్ధము సర్వమును
ఇలలో.. వ్యర్ధము సర్వమును ||పరవాసిని||
ధన సంపదలు గౌరవములు
దహించిపోవు నీలోకమున (2)
పాపము నిండె జగములో (2)
శాపము చేకూర్చుకొనే
లోకము.. శాపము చేకూర్చుకొనే ||పరవాసిని||
తెలుపుము నా అంతము నాకు
తెలుపుము నా ఆయువు యెంతో (2)
తెలుపుము ఎంత అల్పుడనో (2)
విరిగి నలిగియున్నాను
నేను.. విరిగి నలిగియున్నాను ||పరవాసిని||
ఆ దినము ప్రభు గుర్తెరిగితిని
నీ రక్తముచే మార్చబడితిని (2)
క్షమాపణ పొందితివనగా (2)
మహానందము కలిగే
నాలో.. మహానందము కలిగే ||పరవాసిని||
యాత్రికుడనై ఈ లోకములో
సిలువ మోయుచు సాగెదనిలలో (2)
అమూల్యమైన ధనముగా (2)
పొందితిని నేను
యేసునే.. పొందితిని నేను ||పరవాసిని||
నా నేత్రములు మూయబడగా
నాదు యాత్ర ముగియునిలలో (2)
చేరుదున్ పరలోక దేశము (2)
నాదు గానము ఇదియే
నిత్యము.. నాదు గానము ఇదియే ||పరవాసిని||
About Our channel:
Bekind - Telugu Christian Songs...
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు - Aandhra Kraisthava Keerthanalu Telugu Songs with Lyrics...
Exclusive Telugu Christian Songs - Andhra Christava Keerthanalu - Updating 100's of Songs...
For more updates
Please do subscribe our channel:https://bit.ly/2zgchLZ
Comments
Post a Comment