Bhajana Cheyuchu Bhakthapaalaka - భజన చేయుచు భక్తపాలక Song with Lyrics | Jesus Telugu Audio Songs

భజన చేయుచు భక్తపాలక

Bhajana Cheyuchu Bhakthapaalaka - భజన చేయుచు భక్తపాలక Song with Lyrics | Jesus Telugu Audio Songs.
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు.

భజన చేయుచు భక్తపాలక
ప్రస్తుతింతు నీ నామమును (2)
వృజినములపై జయము నిచ్చిన (2)
విజయుడా నిను వేడుకొందు         ||భజన||

దివ్య పదవిని విడిచి నీవు
దీనుడవై పుట్టినావు (2)
భవ్యమైన బోధలెన్నో (2)
బాగుగా ధర నేర్పినావు           ||భజన||

నరుల గావను పరమునుండి
ధరకు నీవు వచ్చినావు (2)
పరుడ నైన నా కొరకు నీ (2)
ప్రాణము నర్పించినావు           ||భజన||

చెడినవాడ నైన నన్ను
జేరదీసి ప్రోచినావు (2)
పడిన నాడు గోతి నుండి (2)
పైకి లేవనెత్తి నావు          ||భజన||

ఎంత ప్రేమ ఎంత దయ
ఎంత కృప యేసయ్య నీకు (2)
ఇంతయని వర్ణింప నిలలో (2)
నెవనికిని సాధ్యంబు కాదు          ||భజన||

                               

About Our channel:

Bekind - Telugu Christian Songs...

ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు - Aandhra Kraisthava Keerthanalu Telugu Songs with Lyrics...

Exclusive Telugu Christian Songs - Andhra Christava Keerthanalu - Updating 100's of Songs...
For more updates
Please do subscribe our channel:https://bit.ly/2zgchLZ

Comments